పుట్టిన రోజు వేళ యాదగిరి గుట్టలో సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు

పుట్టిన రోజు వేళ యాదగిరి గుట్టలో సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు

యాదాద్రి: సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం (నవంబర్ 8) యాదాద్రికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రులు, అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. పూర్ణ కుంభంతో సీఎం రేవంత్ రెడ్డిని ఆలయంలోకి స్వాగతించారు. అనంతరం ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. 

ఈ సందర్భంగా అర్చకులు సీఎం రేవంత్ రెడ్డికి తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనం పూర్తి అయిన తర్వాత యాదాద్రి ఆలయ అభివృద్ధిపై వైటీడీఏ అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం పూర్తి కాగానే.. సీఎం రేవంత్ రెడ్డి మూసీ పునరుజ్జీవ సంకల్ప యాత్ర చేపట్టనున్నారు. 

Also Read : CM రేవంత్ ప్రజా జీవితం యువకులకు ఆదర్శం

ఈ పాదయాత్రలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతంలో ఐదు కిలో మీటర్లు నడవనున్నారు. ఈ సందర్భంగా రైతులు, స్థానికులతో ఆయన మాట ముచ్చట కలపనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, తదితరులు ఉన్నారు.