సీఎం రేవంత్​ ఇచ్చిన హామీలు అమలు చేయాలె 

  • సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి 


సిద్దిపేట:   ప్రధాని మోదీకి సొంత బలం లేదని,  అందుకే బీహర్​, ఏపీకి ప్రత్యేక నిధులు ఇచ్చారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ  వెంకట్​రెడ్డి ఆరోపించారు.   సిద్దిపేటలోని సీపీఐ ఆఫీస్​లో మీడియాతో ఆయన మాట్లాడారు..  కేంద్రం  తెలంగాణకు అన్యాయం చేస్తూ  మొండిచేయి చూపిందన్నారు.  నిధులు లేక రాష్ట్రంలో అప్పులు కుప్పులుగా మారాయన్నారు.  కేంద్ర ప్రభుత్వం దేశంలో వెంటనే కుల జనగణన చేపట్టాలని డిమాండ్​ చేశారు.  

ఇండియా కూటమిలో కులజనగణన చేపట్టాలని చర్చ జరిగిందన్నారు. ఏపీ లో చంద్రబాబు ప్రపంచ బ్యాంక్ తో ఒప్పందం చేసుకుని విద్యుత్​ ఛార్జీలు పెంచారన్నారు.  దేశవ్యాప్తంగా డాక్టర్లు ధర్నాలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్​ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు.  గత కేసీఆర్​ ప్రభుత్వంలో రేషన్​కార్డుల లేవని, ఇప్పుడు రేవంత్​ సర్కార్ ఎప్పడివరకు ఇస్తుందో ప్రజలకు చెప్పాలన్నారు.  రాష్ట్రంలో  సీఎం రేవంత్​ రెడ్డి పాలనకు  అవినీతి రహిత పాలనగా పేరు రావాలన్నారు.  గురుకులంలోని సమస్యలను ప్రభుత్వం  వెంటనే పరిష్కరించాలన్నారు.