హైదరాబాద్​ లో భారీ వర్షం.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్​ రెడ్డి

హైదరాబాద్​ లో భారీ వర్షం.. అధికారులను అప్రమత్తం చేసిన సీఎం రేవంత్​ రెడ్డి

హైదరాబాద్ లోఓ గురువారం ( ఏప్రిల్​3) భారీ వర్షం పడింది.  అరగంటపాటు కురిసిన విధ్వంసం సృష్టించింది.  ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్​ రెడ్డి అన్ని డిపార్ట్​మెంట్లను ఆదేశించారు.  రోడ్లపై ఎక్కడపడితే ట్రాఫిక్​ స్థంభించడంతో...  సాధ్యమైనంత త్వరగా క్లియ‌ర్ చేసి వాహ‌న‌దారులు త్వరగా ఇళ్లకు చేరుకునేలా చూడాల‌ని పోలీసు అధికారుల‌ను ఆదేశించారు. ప్రజలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని  సీఎస్‌ను ఆదేశించారు. . అన్ని శాఖల అధికారులను అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు

తెలంగాణ వ్యాప్తంగా   లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపై నీటి నిల్వలు లేకుండా ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ అంత‌రాయాలు లేకుండా జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా విభాగాలు సమన్వయంతో పని చేయాలని సీఎం ఆదేశించారు.

తెలంగాణలో గురువారం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.  భారీ వ‌ర్షం, ఈదురుగాలుల‌తో రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రంలో లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యమ‌య్యాయి.  హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  అర గంటసేపు వర్షంతో హైదరాబాద్ రోడ్లనీ చెరువులను తలపిస్తున్నాయి. పలు చోట్ల ఈదురుగాలులతో చెట్లు విరిగిపడ్డాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి మరో నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్  జారీ చేసింది.