
ప్రతిపక్ష నేత కేసీఆర్ రెండుసార్లే సభకు వచ్చి రూ. 57 లక్షల జీతం తీసుకున్నారని సీఎంరేవంత్రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకొని ప్రజల సమస్యలను గాలికి వదిలిన .. కేసీఆర్ తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టారన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితో ఏర్పడిన వ్యవస్థలను నిర్వీర్యం చేసిన కేసీఆర్... హయాంలో గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరిగాయన్నారు.
గతంలో బలహీన వర్గాలకు చెందిన ఓ మహిళా గవర్నర్ ను అవమాన పరిచే విధంగా కేసీఆర్ ప్రవర్తించాన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యం,ప్రభుత్వాలు ఏ ఒక్కరి వ్యక్తుల సొంతం కాదన్నారు.
Also Read : కేసీఆర్ సభకు వచ్చినప్పుడే.. కృష్ణా జలాలపై చర్చిద్దాం
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ పైకి ఏపీ పోలీసులు వస్తే కేసీఆర్ ఏంచేశారని ప్రశ్నించారు. తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాసింది బీఆర్ఎస్ కాదా అని ప్రశ్నించారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్నేతలు ఇలానే మాట్లాడేది అన్నారు. గవర్నర్ ప్రసంగం కాంగ్రెస్ విధానాలకు ఎలా ఉంటుంది.. మంత్రివర్గం ఆమోదించిన స్పీచ్ ను గవర్నర్ చదువుతారని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ అన్నారు,