కేటీఆర్,హరీశ్ అక్రమాలు తేలుస్తాం: సీఎం రేవంత్

కేటీఆర్,హరీశ్ అక్రమాలు తేలుస్తాం: సీఎం రేవంత్

చార్మినార్ వద్ద రాజీవ్ గాంధీ 34వ సద్భావన యాత్ర సంస్మరణ దినోత్సవం జరిగింది.  ఈ సద్భావన యాత్రలో  సీఎ రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ... . కులాలను మతాలను ఏకం చేయడానికే రాజీవ్​ సద్భావన యాత్ర ఏర్పాటు చేశామని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు.  కాంగ్రెస్​ప్రభుత్వం పేదలను అక్కున చేర్చుకుంటే.. బీఆర్ఎస్​ నేతలు గుండెలు బాదుకుంటున్నారన్నారు.  చెరువుల్లో పూడిక తీసే పనిని హైడ్రా చేస్తుందన్నారు. ప్రభుత్వ అనుమతులు ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు.  మూసీలో ఉన్నవారికి డబుల్​ ఇంటితో పాటు రూ, 2 లక్షలు ఇస్తున్నామన్నారు,  

సోనియా గాంధీ ప్రధాని పదవినే త్యాగం చేస్తే.... కేసీఆర్​ కుటుంబం  తెలంగాణను దోచుకుందని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. మత సామరస్యానికి హైదరాబాద్​ ప్రతీక అని రాజీవ్​ అన్నారని సీఎం రేవంత్​ తెలిపారు.  పేదలను అభివృద్ది చేసేందుకు మాజీ మంత్రి గీతారెడ్డి కృషి చేశారన్నారు.  రాజీవ్​ గాంధీ స్ఫూర్తిని కొనసాగించడం అభినందించాల్సిన విషయంటూ.... తెలంగాణలో వారిస్ఫూర్తిని కొనసాగిస్తామన్నారు.  

కేసీఆర్​, కేటీఆర్​ అక్రమాలను నిగ్గు తేలుస్తాం

ఎస్సీ, ఎస్టీలకు భూములు పంచిన ఘనత కాంగ్రెస్​ ప్రభుత్వానిదేనన్నారు.  వేలాది కోట్ల రూపాయిలను దేశం కోసం నెహ్రూ ఖర్చుబెట్టారంటూ.... దేశాన్ని సమగ్రంగా ఉంచేందుకు ఇందిరా గాంధీ ప్రాణాలు అర్పించారన్నారు. కాంగ్రెస్​ పాలనలోనే పేదలకు మేలు జరుగుతుందంటూ.. ఆస్తులు త్యాగం చేసిన గాంధీ కుటుంబం....  దేశాన్ని ఎంతో అభివృద్ది చేసిందన్నారు. నియంత పాలనను గద్దె దింపడం కోసం మాసీ మంత్రి గీతారెడ్డి ఎంతో కృషి చేశారన్నారు.కేసీఆర్​, కేటీఆర్​ అక్రమాలను నిగ్గు తేలుస్తామని సీఎం రేవంత్​ అన్నారు.

ALSO READ | బీఆర్​ఎస్​ నేతలు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు: టీపీసీసీ చీఫ్​

అధికారం పోయినా... అహంకారం తగ్గలేదు..

ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై హైడ్రా అంకుశం లాగా పని చేస్తుందన్నారు. ఆక్రమణదారులు హైడ్రాను చూసి భయపడుతున్నారన్నారు.  కొందరు హైదరాబాద్​ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రయత్నిస్తున్నారన్నారు.  కాంగ్రెస్​ ప్రభుత్వం అలాంటి వారి భరతం పడుతుందని తెలిపారు. బీఆర్​ఎస్​ దాచిపెట్టిన డబుల్​ ఇండ్లను పేదలకు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.మూసీలో ఉన్నవారికి ఇంటితో పాటు రూ. 2 లక్షలు రుణం ఇస్తున్నామన్నారు.  బీఆర్​ఎస్ ​ ప్రభుత్వం పోయినా.. ఆపార్టీ నేతలకు ఇంకా అహంకారం తగ్గలేదన్నారు. 

నాళాలను ఆక్రమించి ఫామ్​ హౌస్​ లు కట్టారు

పేదలు ఎవరైనా ఫామ్​ హౌస్​లు కట్టుకోగలరా అని ప్రశ్నించారు.  హైడ్రా అనగానే కేసీఆర్​, కేటీఆర్​, ఈటల బయటకు వచ్చారన్నారు. ఫామ్ హౌస్​ లకు బుల్డోజర్లు వస్తాయని కేసీఆర్​, కేటీఆర్​, హరీష్​రావు నాటకాలు ఆడుతున్నారన్నారు.  ఫిరంగి నాళాలను ఆక్రమించి కేటీఆర్​ ఫాంహౌస్​ కట్టారని సీఎం రేవంత్​ అన్నారు.  నా ఇంటి ముందుకు వచ్చి చేతులు కట్టుకున్న రోజులు హరీష్​ రావు మర్చిపోయారా అని ప్రశ్నించారు.వాట్సప్​ యూనివర్శిటీలతో ఆర్థిక ప్రగతిని దెబ్బతీసే కుట్ర జరుగుతుందన్నారు.