సీఎంకు బీసీ, ఎస్సీ మంత్రుల సన్మానం

సీఎంకు బీసీ, ఎస్సీ మంత్రుల సన్మానం

హైదరాబాద్, వెలుగు: బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని బీసీ, ఎస్సీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ నేతలు ఘనంగా సన్మానించారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్ లో హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో  విప్ అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామేలు, కడియం శ్రీహరి, కాలే యాదయ్య, లక్ష్మీకాంతరావు సీఎంకు గజమాలతో సన్మానం చేశారు. 

ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కులగణనపై చర్చ పూర్తయ్యాక సీఎంను బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో  విప్ ఆది శ్రీనివాస్, వాకాటి శ్రీనివాస్ , బీర్ల ఐలయ్యతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కలిసి సన్మానించారు.