టీటీడీ బోర్డు మాదిరిగా యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఆలయ అభివృద్ధి పనులు ముందుకు సాగాలని స్పష్టం చేశారు. ‘స్పీడ్’ ప్రాజెక్టులపై సచివాలయంలో సమీక్షించిన ఆయన.. ఎకో, టెంపుల్ పర్యాటక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
యాదగిరిగుట్ట అభివృద్ధిపై అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలను ఇచ్చారు. టీటీడీ బోర్డు తరహాలోనే యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భక్తులకు సౌకర్యాలు , భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన చర్యలపై స్పష్టమైన వివరాలు అందించాలన్నారు. ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు అర్ధంతరంగా వదిలేయడానికి వీల్లేదని… ఆలయ అభివృద్ధిని మరో స్థాయికి తీసుకెళ్లాలని అధికారులకు స్పష్టం చేశారు. వైటీడీఏ, యాదగిరిగుట్టకు సంబంధించి పూర్తి స్టేటస్ రిపోర్టు తనకు అందించాని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
ALSO READ | Telangana Special : గోవర్థనగిరిలోని అందాల గుట్టలో.. అంజన్న ఆలయం.. వరదపాశం ఇక్కడ స్పెషల్