
- 100 బెడ్స్ హాస్పిటల్ సహా
- పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
- శివునిపల్లి శివారులో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరు
- ఏర్పాట్లు పూర్తి చేసిన ఆఫీసర్లు
జనగామ, వెలుగు: జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. శివునిపల్లి వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. రూ. 800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. జఫర్ఘడ్ మండలం కోనాయిచలం వద్ద రూ రూ.200 కోట్లతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్, ఘన్‌పూర్‌లో రూ.45.50 కోట్లతో నిర్మించనున్న 100 పడకల హాస్పిటల్ బిల్డింగ్, రూ.26 కోట్లతో డివిజనల్ ఆఫీస్కాంప్లెక్స్ నిర్మాణంతో పాటు అభివృద్ధిపనులకు సభా వేదిక వద్ద నుంచే శంకుస్థాపన చేయనున్నారు.
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. సభ ఏర్పాట్లను శనివారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పరిశీలించి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల స్టాల్స్‌ను సందర్శిస్తారు. అక్కడే స్వయం సహాయక సంఘాలకు ఏడు మహిళా శక్తి బస్సులను అందిస్తారు. ఆ తరువాత బహిరంగ సభలో పాల్గొని ప్రజా పాలనపై మాట్లాడనున్నారు.