
- అపాయింట్మెంట్ ఇవ్వాలని రిక్వెస్ట్
- అన్ని పార్టీల ప్రతినిధులతో కలిసి వస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్మెంట్ కోరుతూ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం లేఖ రాశారు. తెలంగాణలోని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ ప్రతినిధులతో వచ్చి కలిసేందుకు సమయం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులను శాసనసభ ఆమోదించిన విషయాన్ని లేఖలో సీఎం ప్రస్తావించారు.
ఆ బిల్లులకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని కోరారు. కాగా, రాష్ట్రంలోని విద్య, ఉద్యోగాలతోపాటు స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా తీసుకొచ్చిన రెండు బిల్లులకు తెలంగాణ శాసనసభ సోమవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు మరో లేఖ
చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్ పేరును “పొట్టి శ్రీరాములు చర్లపల్లి రైల్వే టెర్మినల్ స్టేషన్” గా మార్చాలని కోరుతూ కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ కు సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరును పెట్టడంతో.. పొట్టి శ్రీరాములు పేరును చర్లపల్లి రైల్వే టెర్మినల్ కు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి సూచించారు.