డీఎస్సీ అభ్యర్థులకు అక్టోబర్ 9న నియామక పత్రాలు అందజేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎల్బీస్టేడియంలో 9వ తేదీన సాయంత్రం 4 గంటలకు 11 వేల 63 టీచర్ల ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వబోతున్నామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలకు కొత్తగా నియమితులైన 1635 మందికి శిల్పారామంలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు రేవంత్. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన. తెలంగాణ ఉద్యమానికి నిరుద్యోగులే ఆయువు పట్టు అని చెప్పారు. సమస్యలు పరిష్కరించి నియామక పత్రాలు ఇస్తున్నామన్నారు. నిరుద్యోగులు ఎంతోకాలం ఎదురు చూసి ప్రభుత్వాలపై విశ్వాసం కోల్పోయారన్నారు. నిరుద్యుగు వల్లే నేడు తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చిందన్నారు.
ALSO READ | ఎవరు అడ్డొచ్చినా మూసీ రివర్ ప్రాజెక్ట్ ఆగదు: సీఎం రేవంత్
తాము వచ్చిన 90 రోజుల్లోనే 30 వేల ఉద్యోగాలిచ్చామన్నారు రేవంత్. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు. 1635 మంది కుటుంబాలకు ఈ రోజు అతిపెద్ద పండుగ అని అన్నారు. వందలాది మంది విద్యార్థుల ఆత్మబలిదానాలే ఈ నాడు తెలంగాణ అని చెప్పారు. ఏండ్లుగా మీ నిరీక్షణ ఇవాళ ఫలించబోతుందన్నారు. ఇది ఉద్యోగం కాదు..భావోద్వేగమన్నారు. రాష్ట్ర నిర్మాణంలో మీరు భాగస్వాములు కాబోతున్నారని చెప్పారు. గత ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకోలేదన్నారు రేవంత్.