సనాతన ధర్మమా : సీఎం స్టాలిన్ కుమార్తె గుడిలో పూజలు..

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమార్తె సెంథామరై స్టాలిన్ సోమవారం ప్రార్థనలు చేస్తూ కనిపించారు. ఆమె మైలాడుతురై జిల్లాలోని సిర్కాజిలో ఉన్నహిందూ దేవాలయం సత్తైనాథర్ ఆలయాన్ని సందర్శించడం రాజకీయ దుమారం రేపుతోంది. సెంథామరై హిందూ దేవాలయం సందర్శన సందర్భంగా గతంలో తమిళ మంత్రి, సీఎం ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు ఎత్తిచూపారు. 

2023 సెప్టెంబర్ 3న చెన్నలో జరిగిన ఓ కార్యక్రమంలో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే లేపాయి. సనాతన ధర్మం మలేరియా, డెంగ్యూ, కరోనా తో పోల్చాడు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని అన్నారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. 

యూపీ సన్యాసి దీనిపై స్పందిస్తూ ఉదయనిధి స్టాలిన్ తల కొట్టి తెచ్చిన వారికి రూ 10 కోట్లు ఇస్తానని ప్రకటించడం.. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మాటల యుద్ధంతో రాజకీయ దుమారం రేగింది. 

Also Read :- వికారాబాద్ లో దొంగల బీభత్సం

ప్రధాని మోదీ సైతం దీనిపై స్పందిస్తూ.. సనాతన ధర్మం వ్యతిరేకించే వారిని గట్టిగా ఎదుర్కోవాలని పిలుపు నిచ్చారు.  దీంతో మరింత రాజకీయ రగడ నెలకొంది. 

అయితే ఇదే విషయంలో సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను విమర్శిస్తూ.. తన తల్లిని గుడికి వెళ్లకుండా ఆపాలని ఉదయనిధి స్టాలిన్ కు సవాల్ విసిరారు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై. సనాతన ధర్మం శాశ్వతమైందని అన్నామలై స్పష్టం చేశారు. 

సనాతన ధర్మంపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న నేపథ్యంలో సీఎం ఎంకే స్టాలిన్ కుమార్తె... మంత్రి ఉదయనిధి స్టాలిన్ సోదరి దేవాలయాన్ని సందర్శించడంపై దీనిపై నెటిజన్లు కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇది సనాతన ధర్మం కాదా అంటూ ట్రోల్ చేస్తున్నారు.