11 న భద్రాచలానికి సీఎం

భద్రాద్రి కొత్తగూడెం: ఈనెల 11వ తేదీన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామిని సీఎంతోపాటు పలువురు మంత్రులు దర్శించుకుంటారు. తరువాత జిల్లా అభివృద్ధిపై ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారు. అనంతరం మణుగూరులో  జరిగే ప్రజా దీవెన సభలో సీఎం పాల్గొంటారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై ఎస్పీ రోహిత్ రాజు, ఐటీడీఏ పీవో తో  కలెక్టర్ ప్రియాంక అల ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ALSO READ :- గుడ్ న్యూస్..ఉచిత విద్యుత్ పథకాన్ని పోస్టాఫీసు ద్వారా పొందొచ్చు