మహా ఘట్ బంధన్‎ను నమ్మలే.. బీజేపీ వైపే యూపీ ప్రజలు: CM యోగి ఆదిత్య నాథ్

మహా ఘట్ బంధన్‎ను నమ్మలే.. బీజేపీ వైపే యూపీ ప్రజలు: CM యోగి ఆదిత్య నాథ్

లక్నో: ఉత్తర ప్రదేశ్ బై పోల్స్‎లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘన విజయం సాధించింది. 9 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఏడు చోట్ల బీజేపీ గెలుపు కైవసం చేసుకుంది. మరో రెండు చోట్ల ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీ విజయం దక్కించుకుంది. ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపొందిన నేపథ్యంలో యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శనివారం (నవంబర్ 23) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూపీ ప్రజలు బీజేపీ వైపే ఉన్నారని ఎన్నికల ఫలితాలతో స్పష్టమైందన్నారు.

ప్రతి పక్ష మహా ఘాట్ బంధన్ కూటమిని ప్రజలు నమ్మలేదని.. ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల కుట్రలను ప్రజలు తిప్పికొట్టారని పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారని జోస్యం చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలే బైపోల్స్‎లో బీజేపీని గెలిపించాయని.. ఉప ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం ప్రజలదేనని అన్నారు. మహారాష్ట్రలో కూడా బీజేపీ నేతృత్వంలోని మహయుతి కూటమి కూడా భారీ విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. 

ALSO READ | పార్లమెంట్లో వయనాడ్ గొంతు వినిపించేందుకు ఎదురుచూస్తున్నా..

కాగా, మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎలక్షన్స్.. యూపీ ఉప ఎన్నికల్లో కటేంగే తో బటేంగే అనే నినాదంతో యోగి ఆదిత్యనాథ్ ప్రచారం హోరెత్తించారు. కాగా, వివిధ కారణాలతో ఖాళీ అయిన 9 అసెంబ్లీ స్థానాలకు 2024, నవంబర్ 20న ఉప ఎన్నికలు జరిగాయి. కతేహరి, కర్హల్, మీరాపూర్, ఘజియాబాద్, మజ్హవాన్, సిసామౌ, ఖైర్, ఫుల్పూర్, కుందర్కి అసెంబ్లీ స్థానాలకు ఈసీ ఉప ఎన్నికలు నిర్వహించింది. ఇందులో ఏడు చోట్ల బీజేపీ, రెండు చోట్ల ఎస్పీ విజయం సాధించాయి.