హత్రాస్ తొక్కిసలాట : దోషులను కఠినంగా శిక్షిస్తాం : సీఎం యోగి ఆదిత్యనాథ్

హత్రాస్ తొక్కిసలాట  :  దోషులను కఠినంగా శిక్షిస్తాం  : సీఎం యోగి ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2024 జులై3వ తేదీన బుధవారం హత్రాస్‌ను సందర్శించారు. హత్రాస్ ఘటనలో గాయపడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న  వారిని ఆయన పరామర్శించారు.  ఇది ప్రమాదమా లేదా కుట్రనా అని నిర్ధారించడానికి సమగ్ర విచారణకు సిఎం యోగి ఆదేశించారు.  హత్రాస్‌ ఘటనలో నిజానిజాలను వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనపై సంతాపం వ్యక్తం చేయకుండా ప్రతిపక్షాలు  రాజకీయాలు చేయడం చాలా దురదృష్టకరమని సీఎం అభిప్రాయపడ్డారు.  హత్రాస్ దోషులను కఠినంగా శిక్షిస్తానని సీఎం హెచ్చరించారు.  

యూపీలోని హాథ్రస్‌లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 121కి చేరింది. నిన్న 116 మంది మరణించగా చికిత్స పొందుతూ ఈరోజు మరో ఐదుగురు ప్రాణాలు విడిచారు. ఇదిలా ఉంటే అక్కడ ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేసిన భోలే బాబా పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. బాబాకు సంబంధించిన రామ్ కుటీర్ ఛారిటబుల్ ట్రస్టులో వెతికినా ఆయన కనిపించలేదని తెలిపారు.

యూపీలోని హాథ్రస్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై సీబీఐ విచారణ జరిపేలా ఆదేశాలు ఇవ్వాలని అలహాబాద్ హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని అడ్వకేట్ గౌరవ్ ద్వివేది కోరారు. ఈ తొక్కిసలాటలో ఇప్పటివరకు 121 మంది మరణించగా మరో 20 మందిపైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.