ఐటీఐ స్టూడెంట్ కు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు.. వరాలు కురిపించిన సీఎం

చదువుల రంగంలో మార్పులు తీసుకొస్తున్న   ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు, వారి తల్లులకు  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి మరోసారి ఊరట కలిలించారు.  ఉన్నత చదువులు చదివే పేద విద్యార్ధులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్ధులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్ధులకు రూ. 15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున ఆర్ధిక సాయం చేస్తూ వస్తుంది సర్కార్. ఈ క్రమంలో ఏప్రిల్ 26న జగనన్న వసతి దీవెన  నిధులు విడుదల చేశారు.   రాష్ట్రవ్యాప్తంగా 9,55,662 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 912.71 కోట్లు బటన్‌ నొక్కి జమ చేశారు సీఎం జగన్‌.. అనంతపురం జిల్లా నార్పలలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ఆర్ధిక సాయాన్ని విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు..  బుధవారం ( ఏప్రిల్ 26)  రోజు జమ చేసిన  రూ. 912.71 కోట్లతో కలిపి జగనన్న వసతి దీవెన ద్వారా ఇప్పటివరకు 25,17,245 మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో రూ. 4,275.76 కోట్లు జమ అయ్యాయి.  వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి, వారి తల్లుల ఖాతాల్లో విడతల వారీగా మూడు నెలలకొకసారి  నేరుగా జమ చేస్తున్నారు. 

మూడు నెలలకొకసారి జమ


నిరుపేద విద్యార్ధులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే అర్హులైన పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తోంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. పేదరికం కారణంగా ఏ విద్యార్ధి ఉన్నత చదువులకు దూరం కాకూడదు. చదువుల ఖర్చుతో తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదన్న సమున్నత లక్ష్యంతో.. ఒకవైపు పేద విద్యార్ధుల చదువులకయ్యే ఫీజు ఖర్చులను పూర్తిగా భరించడంతో పాటు మరొకవైపు భోజన, వసతి ఖర్చులకు కూడా వారు ఇబ్బంది పడకూడదనే మంచి ఉద్దేశ్యంతో జగనన్న వసతి దీవెన తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం..

తల్లులకు ప్రశ్నించే హక్కు

పేద విద్యార్ధులు ఉన్నత చదువులు అభ్యసించేందుకు జగనన్న విద్యా దీవెన క్రింద పూర్తి ఫీజు రీఇంబర్స్‌మెంట్, జగనన్న వసతి దీవెన క్రింద ప్రతి విద్యార్ధికి భోజన, వసతి ఖర్చుల కోసం ఏడాదికి మరో రూ. 20,000 వరకు కుటుంబంలో ఎంతమంది చదువుతుంటే అంతమందికి ఆర్ధిక సాయం చేస్తూ వస్తున్నారు.. కాలేజీల్లో జవాబుదారీతనం పెరిగేలా, తల్లులకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ, తల్లుల సాధికారతకు పట్టం కడుతూ ఆర్ధిక సాయం నేరుగా విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం తెలిసిందే.. జాబ్‌ ఓరియెంటెడ్‌ కరిక్యులమ్‌తో ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు కరిక్యులమ్‌లో మార్పులు చేసి నాలుగేళ్ళ ఆనర్స్‌ కోర్సులు, విద్యార్ధులలో నైపుణ్యాలను పెంచి వారు వెంటనే ఉపాధి పొందేలా 30 శాతం నైపుణ్యాభివృద్ధి కోర్సులు తీసుకొచ్చారు.. కరిక్యులమ్‌లో భాగంగా ఆన్‌లైన్‌ వర్టికల్స్, దీనివల్ల విద్యార్ధులు తాము చదువుతున్న కోర్సులతో పాటు తమకు అవసరమైన ఇతర నైపుణ్యాలు ఆన్‌లైన్‌లో నేర్చుకునే వెసులుబాటు కల్పించారు. కరిక్యులమ్‌లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్‌షిప్‌ పెట్టడం ద్వారా విద్యార్ధులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతుంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.