సీఎంఏ ఫలితాలు.. మాస్టర్ మైండ్స్కు ఆల్ఇండియా ఫస్ట్ ర్యాంక్

సీఎంఏ ఫలితాలు.. మాస్టర్ మైండ్స్కు ఆల్ఇండియా ఫస్ట్ ర్యాంక్

​హైదరాబాద్, వెలుగు: ‘ది ఇన్​స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా’ ప్రకటించిన సీఎంఏ ఫలితాల్లో మాస్టర్ మైండ్స్ విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో ప్రభంజనం సృష్టించారని మాస్టర్ మైండ్స్ అడ్మిన్ అడ్వైజర్ సీఏ మట్టుపల్లి మోహన్ తెలిపారు. 

సీఎంఏ ఫైనల్ లో మొదటి 10 ర్యాంకులలో ఆల్ ఇండియా 1, 2, 5వ  ర్యాంకులు సాధించిన ముగ్గురు విద్యార్థులతో పాటు, ఆల్ ఇండియా స్థాయిలో 50 లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులు 14 మంది ఉన్నారని వెల్లడించారు. 

సీఎంఏ ఇంటర్ లో మొదటి 50 ర్యాంకులలో ఆల్ ఇండియా 4వ ర్యాంకు (సౌత్ ఇండియా ఫస్ట్), 10 ర్యాంకుతో పాటు ఇతర ర్యాంకులు సాధించిన విద్యార్థులు 16 మంది ఉన్నారని తెలిపారు.

సీఎంఏ ఫైనల్, సీఎంఏ ఇంటర్ ఫలితాలలో ఆల్ ఇండియా మొదటి 10 ర్యాంకులలో 5 ర్యాంకులు, మొదటి 50 ర్యాంకులలో 30 ర్యాంకులు  మాస్టర్ మైండ్స్ విద్యార్థులు కైవసం చేసుకున్నట్టు పేర్కొన్నారు. 

ఆల్ ఇండియా మొదటి 95ర్యాంకు రిషబ్ ఓస్త్వాల్ ఆర్,  రెండో ర్యాంకు ఎల్ వాగ్దేవా,  ఐదో ర్యాంకు ఎమ్. మోహన్ కృష్ణ సాధించినట్టు ఆయన వెల్లడించారు.