రఘునాథపల్లి, వెలుగు: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఖిలాశాపూర్ గ్రామం లోని సబ్ స్టేషన్ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి. మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. లాక్ బుక్ ,రికార్డులను పరిశీలించి విద్యత్ సరఫరాలో ఏమైనా ఇబ్బందుపై ఆరా తీశారు. సబ్ స్టేషన్ లో సమస్యలను ఆధికారులు సీఎండీ దృష్టి తీసుకువచ్చారు.
అనంతరం రైతులకు నాణ్యమైన విద్యుత్తు అందించడానికి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఈ వేణు ఎం మాధవ్ , డీఈ లక్ష్మీనారాయణరెడ్డి, ఏడీఈ మనోహర్ రెడ్డి ,ఏఈ రవీందర్ , సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.