
కోల్‌బెల్ట్, వెలుగు : సింగరేణి పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి సంస్థ సీఎండీ బలరాం నాయక్ అంగీకరించారని ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్వాసిరెడ్ది సీతారామయ్య తెలిపారు. శనివారం మందమర్రిలోని ఏఐటీయూసీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులకు హామీ ఇచ్చిన మేరకు మేనిఫెస్టోలోని అన్ని అంశాలను అమలు చేస్తామన్నారు. సింగరేణిలో సొంతింటి పథకం అమలు, ఇన్‌కమ్‌ట్యాక్స్ సమస్యను పరిష్కరించాలని సీఎండీని కోరితే ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు.
రిటైర్డ్ కార్మికులకు 11వ వేజ్‌బోర్డు ఎరియర్స్, లాభాల్లో వాటా, దీపావళి బోనస్‌ను త్వరలో చెల్లించేందుకు యాజమాన్యం అంగీకరించిందని వెల్లడించారు. అలాగే కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయని, జీతాలు పెంచాలని 18 రోజులు సమ్మె చేశారని చెప్పారు. సర్కారు జీఓ22 రిలీజ్ చేసినా గెజిట్ పబ్లిష్ చేయకపోవడంతో వేతనాలు పెరగడం లేదన్నారు. కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా సింగరేణి ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరితే ఈఎస్ఐ ద్వారా డబ్బులు కడుతామని యాజమాన్యం హామీ ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ సమావేశంలోఏఐటీయూసీ సెంట్రల్ సెక్రటరీ ఎండీ అక్బర్అలీ, మందమర్రి ఏరియా సెక్రటరీ సలెంద్ర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.