ఇండియాలోకి వచ్చేసిన CMF ఫోన్.. ధర ఎంతంటే..?

ఇండియాలోకి వచ్చేసిన CMF ఫోన్.. ధర ఎంతంటే..?

CMF ఫోన్ 1 ఇప్పుడు ఇండియాలో లాంచ్ అయింది.  నథింగ్ కంపెనీ నుంచి మొదటి CMF స్మార్ట్ ఫోన్. ఇది స్పెక్స్ తో స్పెషల్ డిజైన్ ను కలిగి ఉంటుంది. ఇది బడ్జె ట్ స్మార్ట్ ఫోన్. మీడియా టెక్ డైమెన్సిటీ 7300 చిప్ సెట్ తో పనిచేస్తుంది. దీని ధర, ప్రత్యేకతలు తెలుసుకుందాం.. 

CMF ఫోన్ 1 ధర

CMF ఫోన్ 1 6GB RAM, 128GB స్టోరేజ్ మోడల్ రూ. 15,999 . 8GB RAM, 8GB  స్టోరేజ్  వేరియంట్ కూడా లభిస్తుంది. దీని ధర రూ. 17,999, ఈ డివైజ్ ప్లిప్ కార్ట ద్వారా లభిస్తుంది. లాంచింగ్ ఆఫర్ లో భాగంగా  ఎంపిక చేయబడిన బ్యాంకు కార్డులతో రూ. 14,999 ధరతో CMF ఫోన్ 1ను కొనుగోలు చేయవచ్చు. ఇది లిమిటెడ్ ఆఫర్. 

CMF ఫోన్ 1 ప్రత్యేకతలు, ఫీచర్లు

CMF ఫోన్ 1 6.7 అంగుళా FHD+AMOLED డిస్ ప్లే, 120hz రీఫ్రెష్ రేట్ కు  సపోర్టు చేస్తుంది. 700 నిట్స్ సాధారణ బ్రైట్ నెస్ , 200నిట్స్ గరిష్ట బ్రైట్ నెస్ కలిగి ఉంది. 
ఆండ్రాయిడ్ 14లో రన్ అవుతుంది. CMF ఫోన్ ఆండ్రాయిడ్16 OSకి కూడా అప్ గ్రేడ్ చేసుకోవచ్చు. 33W ఫాస్ట్  ఛార్జింగ్ కు   సపోర్టు చేస్తుంది. 5000mAh బ్యాటరీ ఉంది. స్మార్ట్ ఫోన్ తో పాటు రిటైల్ బాక్స్ లో ఏది ఛార్జర్ ను బండిల్ చేయబడదు. ఫొటోగ్రఫీ కోసం 50 మెగా పిక్సెల్, డ్యుయెల్ రియర్ కెమెరా సెటప్ ఉంది . ముందు భాగంలో సెల్ఫీలు , వీడియో కాల్స్ కోసం 16 మెగా పిక్సెల్ కెమెరా ఉంది.