క్షేత్రస్థాయిలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : సీఎంవో జాయింట్ సెక్రెటరీ సంగీత

క్షేత్రస్థాయిలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : సీఎంవో జాయింట్ సెక్రెటరీ సంగీత

అలంపూర్,వెలుగు: క్షేత్రస్థాయిలో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని సీఎంఓ జాయింట్ సెక్రెటరీ సంగీత అన్నారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి  ఆదేశాల మేరకు మంగళవారం ఉండవెల్లి మండల కేంద్రంలోని మైనార్టీ గురుకుల పాఠశాలను  సంగీత తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలలో సమస్యల గురించి  విద్యార్థులను  అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశాలలో మౌలిక వసతులు, తరగతి గదుల సమస్యపై ప్రిన్సిపల్ సువాసినిని అడిగి తెలుసుకున్నారు. 

ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన మెనూ అమలు గురించి ప్రశ్నించారు. గురుకుల పాఠశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక్కడ కావాల్సిన మౌలిక వసతుల పై ఆరా తీశారు. తనిఖీల్లో భాగంగా విద్యార్థులతో కలిసి రాత్రి అక్కడే నిద్రిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఏవో మదన్మోహన్ తహసీల్దార్  హరికృష్ణ, సీనియర్ అసిస్టెంట్ లక్ష్మిరెడ్డి పాల్గొన్నారు.