సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో సీఎంవో ఆఫీసర్ల పర్యటించారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలో సీఎంవో అడిషనల్ సెక్రటరీ స్మితా సబర్వాల్, విమెన్, చైల్డ్ వెల్ఫేర్ కమిషనర్ దివ్య దేవరాజన్ పర్యటించారు. దళితబంధు లబ్దిదారులతో పథకం ప్రయోజనాల గురించి అడిగి తెలుసుకున్నారు అధికారులు. ఈ పర్యటనలో యాదాద్రి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు పాల్గొన్నారు.
కేసీఆర్ ఫాంహౌస్ ఉన్న ఎర్రవెల్లి నుంచి యాదాద్రి వెళ్లే మార్గంలో ఉన్న వాసాలమర్రి గ్రామాన్ని రూ.100 కోట్లతో అన్ని విధాలా అభివృద్ది చేస్తానని సీఎం గతంలో ప్రకటించారు. అంకాపూర్, ఎర్రవల్లి, చింతమడక ఊర్ల తరహాలో వాసాలమర్రిని రూపురేఖలు మారుస్తామని.. ఊర్లో ప్రతి ఒక్కరికీ ఉపాధి చూపుతామని చెప్పారు. గతంలో ఆయన వాసలమర్రి గ్రామస్థులతో కలిసి సహఫంక్తి భోజనాలు కూడా చేశారు.
ఇవి కూడా చదవండి:
స్టేడియంలో శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన క్రికెటర్
జెండావందనం చేసిన సీఎం కేసీఆర్