- సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్
కరీంనగర్ టౌన్, వెలుగు : ఆకుపచ్చ తెలంగాణే లక్ష్యంగా ముందుకెళ్లాలని, కరీంనగర్‌లో 10 వేల మొక్కలు నాటి కాపాడాలని సీఎంవో ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ అన్నారు. మంగళవారం కరీంనగర్ లోని పీటీసీ, తిమ్మాపూర్ లోని ప్రకృతి వన సంపదను కలెక్టర్ డా.గోపి, సీపీ సుబ్బారాయుడుతో కలిసి సీఎంవో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలు నాటి రాష్ట్రాన్ని పచ్చని తెలంగాణగా తీర్చిదిద్దేలా సీఎం కేసీఆర్నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. అనంతరం పీటీసీ ఆర్చరీలో ట్రైనింగ్ తీసుకుంటున్న ట్రిపుల్‌ఐటీ స్టూడెంట్హంసికను అభినందించారు.