
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూమిపై సుప్రీంకోర్టు స్టే విధించడాన్ని తాము స్వాగతిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఆ భూముల్లో చెట్ల తొలగింపు, చదును చేయడం వంటి పనులను వెంటనే నిలిపేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని తెలిపారు. హెచ్‌సీయూ భూములను కార్పొరేట్ శక్తులకు అప్పగించొద్దని కోరారు. స్టేను దృష్టిలో ఉంచుకుని భూములను వేలం వేసే ప్రక్రియను ఉపసంహరించుకోవాలని, విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.