హైదరాబాద్, వెలుగు: విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రముఖ షాపింగ్ మాల్ సీఎంఆర్ ముందుకు వచ్చింది. ఏపీ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50లక్షలు విరాళం ప్రకటించింది.
శనివారం వెలగపూడిలోని సెక్రటేరియెట్ లో సీఎం చంద్రబాబును కలిసిన సీఎంఆర్ ఫౌండర్ చైర్మన్ మావూరి వెంకటరమణ రూ.50లక్షల చెక్కును అందచేశారు. వరద బాధితుల్ని అదుకునేందుకు ఈ ఫండ్స్ ఉపయోగించాలని సీఎంను ఆయన కోరారు.