
హైదరాబాద్, వెలుగు: సీఎంఆర్ సంస్థ హన్మకొండలో షాపింగ్ మాల్‌ను తెరిచింది. రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్, ఎమ్మెల్యేలు అరూరి రమేశ్, నరేందర్, గుండు సుధా రాణి, మేయర్ సుందర్ రాజు, సినీనటి రాశీఖన్నా కార్యక్రమానికి చీఫ్ గెస్టులుగా వచ్చారు.
ఈ సందర్భంగా వినయ భాస్కర్ మాట్లాడుతూ సీఎంఆర్ షాపింగ్‌మాల్ వంటి సంస్థలు హన్మకొండకు రావడం వల్ల ఇక్కడ ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందని, వాణిజ్యాభివృద్ధి జరుగుతుందని చెప్పారు. సీఎంఆర్చైర్మన్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ కుటుంబానికి, అన్ని వేడుకలకు కావాల్సిన వస్త్రాలు మా దగ్గర దొరుకుతాయని చెప్పారు.
తమ స్టోర్లో ధరలు తక్కువగా ఉంటాయని, తాము సొంతంగా మగ్గాలపై నేయించిన వస్త్రాలను చవక ధరలకు అమ్ముతున్నామని చెప్పారు. సీఎంఆర్ ఎండీ మావూరి మోహన్ బాలాజీ మాట్లాడుతూ ఇది తమకు 26వ షోరూమ్ అని చెప్పారు. రాశీఖన్నా ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అన్ని ఫ్లోర్లను కలియతిరుగుతూ సందడి చేశారు.