హైదరాబాద్, వెలుగు: ఉప్పల్‌లోని రెనొవేట్ చేసిన స్టోర్‌ను సీఎంఆర్ షాపింగ్ మాల్ గురువారం ప్రారంభించింది. అన్ని సెక్షన్లను విశాలంగా మార్చామని వెల్లడించింది. సినీ నటి నిధి అగర్వాల్ ఈ స్టోర్‌ను ప్రారంభించారు. వజ్రం కన్‌స్ట్రక్షన్ చైర్మన్ కోల అంజనేయులు మొదటి కొనుగోలు జరిపారు. ఈ సందర్భంగా సీఎంఆర్ షాపింగ్ మాల్ చైర్మన్ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ, తమ ఉప్పల్ షాపింగ్ మాల్‌ను మరింత విశాలంగా, వైభవంగా తీర్చిదిద్దామని అన్నారు. తమ సంస్థను గత 40 ఏళ్లుగా తెలుగు ప్రజలు ఆదరిస్తున్నారని పేర్కొన్నారు.
‘ప్రజలు తమకు కావాల్సిన అన్ని రకాల, అన్ని వేడుకలకు అవసరమయ్యే దుస్తులను తక్కువ ధరలకే పొందొచ్చు. కుటుంబమంతటికీ నచ్చే విధంగా వస్త్రాలు అందించడమే సీఎంఆర్ ప్రత్యేకత’ అని అన్నారు. లక్షల్లో డిజైన్లు, వెరైటీలు అందుబాటు ధరల్లోనే తమ దగ్గర దొరుకుతాయని వివరించారు. సొంత మగ్గాలపై నేయించిన వస్త్రాలను మార్కెట్‌లో మరెక్కడా లేని ధరకు అమ్ముతున్నామని చెప్పారు. గత మూడు సంవత్సరాలుగా సీఎంఆర్ షాపింగ్ మాల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండడం ఆనందగా ఉందని నిధి అగర్వాల్ అన్నారు.