- మిర్యాలగూడలో సీఎంఆర్ షాపింగ్ మాల్
- బాలాపూర్‌లో సీఎంఆర్ ఫ్యామిలీ మాల్
హైదరాబాద్, వెలుగు: సీఎంఆర్ షాపింగ్ మాల్ మిర్యాలగూడలోని సాగర్ రోడ్ దగ్గర ఓ షాపింగ్ మాల్ ఓపెన్ చేసింది. మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు ఈ మాల్‌ను ప్రారంభించారు. సినీ నటి రాశీఖన్నా ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తమకు ఇది 24 వ షాపింగ్ మాల్ అని సీఎంఆర్ షాపింగ్ మాల్ చైర్మన్ మావురి వెంకటరమణ అన్నారు. అన్ని రకాల వేడుకలకు సంబంధించిన క్లాత్స్ ఇక్కడ దొరకుతాయని చెప్పారు.
పిల్లలు, పెద్దలు అందరకీ నచ్చే డిజైన్స్‌లో తక్కువ ధరకే తమ దగ్గర క్లాత్స్ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. మరోవైపు హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో సీఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఓ షాపింగ్ మాల్‌ను ఓపెన్ చేసింది. ఈ మాల్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డి, సినీ నటి కీర్తి సురేష్ ప్రారంభించారు.
ఈ మాల్‌ను 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. మొత్తం ఐదు అంతస్తులు ఉన్నాయి. పట్టు, ఫ్యాన్సీ, చుడీదార్స్, వెస్ట్రన్ వేర్, బెడ్‌షీట్స్, మెన్స్ బ్రాండెడ్, కిడ్స్‌వేర్, ఎత్నిక్ వేర్ ఇలా వివిధ రకాల దుస్తుల కోసం సపరేట్ ఫ్లోర్లను కేటాయించారు. తమ దగ్గర తక్కువ ధరకే నాణ్యమైన దుస్తులు దొరుకుతాయని సీఎంఆర్ ఫ్యామిలీ మాల్ అధినేత అల్లక సత్య నారాయణ అన్నారు.