- ప్రారంభించిన ఎంపీ ధర్మపురి అరవింద్
న్యూఢిల్లీ : సీఎంఆర్ టెక్స్టైల్స్ అండ్ జ్యూయెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిజామాబాద్‌లోని పులాంగ్ చౌరస్తా వద్ద కొత్త షాపింగ్‌మాల్‌ను ఏర్పాటు చేసింది. దీనిని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ మావూరి వెంకట రమణ మాట్లాడుతూ.. గత 40 ఏళ్లుగా తెలుగు ప్రజలు తమను ఆదరిస్తున్నారని అన్నారు. తమ 35 వ షోరూమ్‌ను నిజామాబాద్‌లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. ప్రపంచస్థాయి షాపింగ్ అనుభూతిని సీఎంఆర్ షాపింగ్ మాల్లో పొందొచ్చని, ప్రజలకు కావాల్సిన అన్ని రకాల బట్టలు ఇక్కడ దొరుకుతాయని పేర్కొన్నారు.
సొంత మగ్గాలపై నేయించిన వస్త్రాలను తక్కువ ధరకే అమ్ముతున్నామని అన్నారు. ఫ్యామిలీ అందరికీ అన్ని రకాల డిజైన్లు, వెరైటీలతో కూడిన బట్టలు సీఎంఆర్ షాపింగ్ మాల్లో దొరుకుతాయని ఈ సంస్థ ఎండీ మావూరి మోహన్ బాలాజీ అన్నారు. ఈ కొత్త షోరూమ్ ఓపెనింగ్‌లో సినీ హీరో రామ్ పోతినేని, సినీ నటి పాయల్ రాజ్‌పుత్ కూడా పాల్గొన్నారు. క్వాలిటీ డిజైన్లతో సీఎంఆర్ షాపింగ్ మాల్ అగ్రగామిగా నిలిచిందని రామ్ ఈ సందర్భంగా అన్నారు. సీఎంఆర్ అంటే క్వాలిటీకి మారుపేరని పాయల్ పేర్కొన్నారు.