మేడ్చల్​లో సీఎంఆర్​ మాల్

మేడ్చల్​లో సీఎంఆర్​ మాల్

హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద వస్త్రవ్యాపార సంస్థ సీఎంఆర్​ టెక్స్​టైల్స్​​మేడ్చల్లో షాపింగ్ మాల్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేసింది. దీనిని సినీ నటుడు విశ్వక్​సేన్​ శుక్రవారం ప్రారంభించారు. 

ఈ సందర్భంగా సీఎంఆర్​ చైర్మన్​ మావూరి వెంకటరమణ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలవాసులు గత నాలుగేళ్లుగా తమ సంస్థను ఎంతగానో ఆదరిస్తున్నారని చెప్పారు. తమ దగ్గర షాపింగ్​ ప్రపంచస్థాయి అనుభూతిని ఇస్తుందన్నారు. 

కుటుంబం అంతటికీ నచ్చేలా తక్కువ ధరలకే దుస్తులు ఇవ్వడం తమ ప్రత్యేకత అని చెప్పారు. వస్త్రాలను తమ సొంత మగ్గాలపైనే నేయిస్తున్నామని రమణ చెప్పారు.

ఎండీ మావూరి మోహన్​ బాలాజీ మాట్లాడుతూ ఇక్కడ అందరికీ నచ్చే అన్ని రకాల వెరైటీలు, డిజైన్లు లభిస్తాయని చెప్పారు.  సీఎంఆర్ ​నాలుగు దశాబ్దాలుగా వస్త్రరంగంలో క్వాలిటీకి, డిజైన్స్​కు మరోపేరుగా నిలిచిందని విశ్వక్​సేన్ ప్రశంసించారు. 

స్టోర్​ అంతా తిరుగుతూ అన్ని రకాల వస్త్రాలను పరిశీలించారు. తనకు అన్ని రకాల కలెక్షన్స్​ బాగా నచ్చాయన్నారు. తను షాపింగ్​ చేసిన వాటిని అభిమానులకే ఇచ్చేశారు.