సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కాం ట్రీట్‌మెంట్ చేయకుండా నకిలీ పేర్లతో నిధులు స్వాహా

సీఎంఆర్ఎఫ్ చెక్కుల స్కాం ట్రీట్‌మెంట్ చేయకుండా నకిలీ పేర్లతో నిధులు స్వాహా

తెలంగాణ రాష్ట్రంలో CMRF చెక్కుల స్కాం బయటపడింది. సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో ఆరు కేసులు నమోదు చేసింది సీఐడీ. ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల్లోని పలు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు వైద్యం చేయకున్నా బిల్లులు కాజేశారని ఆరోపణలు వచ్చాయి. సిఐడి 28 ఆసుపత్రుల పైన కేసులు నమోదు చేసింది. హాస్పిటల్స్ పై విచారణ వేగవంతం చేసింది.

30 ఆస్పత్రులు నకిలీ పిల్లల పేర్ల మీద వందల కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధులు కొట్టేసారని నిర్ధారణ అయ్యింది. ఆస్పత్రి సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు కలిసి నిధులు కొట్టేసారని పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో గుర్తించారు. సచివాలయంలోని సిఎంఆర్ఎఫ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదుపై సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.