వెంకటాపురం, వెలుగు: ములుగు జిల్లా వెంకటాపురం ఆర్ బీ గెస్ట్ హౌస్ ప్రాంగణంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను తాజా మాజీ వైస్ ఎంపీపీ సయ్యద్ హుస్సేన్, మాజీ ఎంపీటీసీ సీతాదేవి పంపిణీ చేశారు. ఇందులో లబ్ధిదారులు రాజ్సీతారాం రూ.60,000 విలువ చేసే చెక్కు, నూకరాజు రూ.45,000, సుంకర చంటి రూ.25,500, మంజుల రూ.9000 విలువ చేసే చెక్కులను అందుకున్నారు. అనంతరం మాజీ ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజా పాలన నడుస్తుందన్నారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహలక్ష్మి, రైతులకు రుణమాఫీ వంటి పథకాలు అమలు చేస్తున్నదని, మరిన్ని ప్రజా సంక్షేమ పథకాలను తీసుకురానున్నది తెలిపారు. కార్యక్రమంలో బాలసాని వేణు, రమేశ్, పిల్లారిశెట్టి మురళి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.