ఆంధ్రానగర్ లో సీఎంఆర్ఎఫ్​ చెక్కుల అందజేత

 ఆంధ్రానగర్ లో సీఎంఆర్ఎఫ్​ చెక్కుల అందజేత

నందిపేట, వెలుగు:  మండలంలోని సీహెచ్.కొండూర్​, ఆంధ్రానగర్​ గ్రామాలకు చెందిన బాధిత కుటుంబాలకు గురువారం కాంగ్రెస్​ పార్టీ మండల అధ్యక్షుడు మంద మహిపాల్ సీఎంఆర్ఎఫ్​ చెక్కులను అందజేశారు.

కొండూర్​ కు చెందిన బొండ్ల సుజాత అనారోగ్యం బారిన పడడంతో వైద్యం సాయం కోసం దరఖాస్తు చేసుకోగా రూ.32వేలు, ఆంధ్రానగర్​ గ్రామానికి చెందిన సత్తెనపల్లి సుమతికి రూ.60 వేలు మంజూరయ్యాయి. సీఎంఆర్​ఎఫ్​ మంజూరుకు కృషి చేసిన నియోజకవర్గ ఇన్​చార్జి వినయ్​రెడ్డి కి బాధిత కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.