- చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య
చేవెళ్ల, వెలుగు: సీఎం సహాయనిధి పేద ప్రజలకు వరం లాంటిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. తన క్యాంపు ఆఫీస్లో 99 మంది లబ్ధిదారులకు బుధవారం ఆయన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. అనంతరం పట్టణంలో రూ. కోటి జడ్పీ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. చేవెళ్ల అభివృద్ధికి కావాల్సిన నిధులను సమకూరుస్తున్నానని, నియోజకవర్గంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్ రెడ్డి, డీసీసీ ఉపాధ్యక్షుడు ఆగిరెడ్డి, మాజీ ఎంపీటీసీ గుండాల రాములు, మాజీ సర్పంచ్ పడాల ప్రభాకర్ పాల్గొన్నారు.