సీఎంఆర్ఎఫ్ ​నిరుపేదలకు వరం : గుత్తా సుఖేందర్ రెడ్డి

సీఎంఆర్ఎఫ్ ​నిరుపేదలకు వరం : గుత్తా సుఖేందర్ రెడ్డి
  • శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

చిట్యాల, వెలుగు : సీఎంఆర్ఎఫ్​నిరుపేదలకు వరంలా మారిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన పాకాల రాములమ్మ, పెండేలా సంధ్యకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన అందజేశారు. అనంతరం గుత్తా మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్​పథకం పేదలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

అర్హులైన ప్రతిఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు పల్లపు బుద్ధుడు, పట్ల జనార్దన్, జనపాల శ్రీను, పాకాల దినేశ్, మర్రి రమేశ్, ఉయ్యాల నరేశ్, పోలగోని శంకర్, పాకాల బాలరాజు, పాకాల చిన్న బచ్చయ్య, పాకాల మల్లయ్య, గంగాపురం వెంకన్న  తదితరులు పాల్గొన్నారు.