
మెట్‌పల్లి/మల్లాపూర్, వెలుగు: ఆపదలో హాస్పిటళ్లలో చికిత్స తీసుకున్న పేదలకు సీఎంఆర్‌ఎఫ్ అండగా నిలుస్తుందని కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం మండలంలో 40 మందికి, మల్లాపూర్‌లో 49 మందికి మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అనంతరం మల్లాపూర్ మండలం గొర్రెపల్లి గ్రామంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేశారు
. ఆయా కార్యక్రమాల్లో కాంగ్రెస్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, గూడ శ్రీకాంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు గంగాధర్, ఏఎంసీ చైర్‌పర్సన్ పుష్పలత, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు జలపతిరెడ్డి, మాజీ ఎంపీపీ రాజన్న, లీడర్లు దేవేందర్, బాపురెడ్డి, జీవన్‌రెడ్డి, రవీందర్, నందు పాల్గొన్నారు.