ఇకనుంచి ఆన్ లైన్లో సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు: సీఎం రేవంత్రెడ్డి

ఇకనుంచి ఆన్ లైన్లో సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు: సీఎం రేవంత్రెడ్డి

హైదరాబాద్: CMRF నిధులు దుర్వినియోగం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇక నుంచి ఆన్లైన్లో సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక వెబ్ సైట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు.  CMRF నిధులు పక్కదారి పట్టకుండా పారదర్శకతతో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదశించారు.

 సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆధ్వర్యంలో వెబ్ సైట్ రూపొందించారు. ఇక నుంచి  ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తులను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయనున్నారు. సీఎంఆర్ఎఫ్ కోసం వచ్చే బాధితుల నుంచి వివరాలు సేకరించి.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, సిఫార్సు లేఖలను వెబ్ సైట్లో  అప్ లోడ్ చేస్తారు. అప్లికేషన్ తర్వాత సీఎంఆర్ఎఫ్ కు సంబంధించి ఒక కోడ్ ఇవ్వనున్నారు.

 అన్నివివరాలు సరిగ్గా ఉంటేనే సీఎంఆర్ఎఫ్ ఆమోదించి చెక్కులు  జారీ చేయనున్నారు. ఈనెల 15తర్వాత సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులను ఆన్ లైన్ లో స్వీకరించనున్నట్లు అధికారులు ప్రకటించారు