చెన్నై మెట్రోలో ఉద్యోగాలు.. నెలకు రూ. 60 వేల నుంచి రూ.80 వేల జీతం

 చెన్నై మెట్రోలో  ఉద్యోగాలు.. నెలకు రూ. 60  వేల నుంచి రూ.80 వేల జీతం

నందనంలోని చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌లో మేనేజర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు CMRL నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఖాళీగా ఉన్న  మేనేజర్‌ పోస్టులను డిప్యూటేషన్, కాంట్రాక్ట్ పద్దతిపై రిక్రూట్ మెంట్ చేయనున్నారు.  పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌ ఉత్తీర్ణత ఉన్నవారు దరఖాస్తుచేసుకోవాలని నందనం CMRL తెలిపింది.  సరైన అర్హతలు గల అభ్యర్థులు తమ దరఖాస్తులను  ఆగస్టు 28 లోగా THE ADDITIONAL GENERAL MANAGER (HR),   CHENNAI METRO RAIL LIMITED, METROS, ANNA SALAI, NANDANAM, CHENNAI - 600 035.  చిరునామాకు పంపాలి. ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగాల ఎంపిక ఉంటుంది.

నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు:

  • మొత్తం ఖాళీలు: 08
  • డిప్యూటీ జనరల్ మేనేజర్(ఎలక్ట్రికల్ & మెకానికల్): 02
  • మేనేజర్(ఎలక్ట్రికల్ & మెకానికల్): 03
  • మేనేజర్(ఎన్విరాన్‌మెంట్): 01
  • డిప్యూటీ మేనేజర్(ఎలక్ట్రికల్ & మెకానికల్): 01
  • అసిస్టెంట్ మేనేజర్ (ఎలక్ట్రికల్ & మెకానికల్): 01
  • అసిస్టెంట్ మేనేజర్ (ఎన్విరాన్‌మెంట్): 01
  • విభాగాలు: ఎలక్ట్రికల్ & మెకానికల్, ఎన్విరాన్‌మెంట్
  • అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌ ఉత్తీర్ణత 
  • వయోపరిమితి: 26.07.2023 నాటికి 30-38 సంవత్సరాలు 
  • దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.50.
  • ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, మెడికల్ ఎగ్జామినేషన్ 
  • జీతం: నెలకు రూ.60000-రూ.80000 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. హార్డు కాపీలను సంబంధిత చిరునామాకి పంపాలి
 
దరఖాస్తులు పంపవలసిన చిరునామా:     THE ADDITIONAL GENERAL MANAGER (HR), 
                                                                             CHENNAI METRO RAIL LIMITED, METROS, 
                                                                              ANNA SALAI, NANDANAM, CHENNAI - 600 035.
దరఖాస్తుకు చివరి తేది: 28.08.2023