- బీఎంఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పేరం రమేశ్
నస్పూర్, వెలుగు: సింగరేణి కార్మికుల హక్కులు, డిమాండ్లను సాధించడం బీఎంఎస్ యూనియన్తోనే సాధ్యమని సింగరేణి కోల్మైన్స్ కార్మిక సంఘ్(బీఎంఎస్) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పేరం రమేశ్అన్నారు. ఆదివారం శ్రీరాంపూర్లోని యూనియన్ ఆఫీస్లో బీఎంఎస్ ముఖ్య కార్యకర్తల అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్స్థాయిలో కార్మికుల సమస్యలపై పోరాటాలు, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలన్నారు.
11వ వేతన ఒప్పందం సాధించడంలో బీఎంఎస్ యూనియన్, నేషనల్ లీడర్, జేబీసీసీఐ మెంబర్ కొత్తకాపు లక్ష్మారెడ్డి కీలకంగా వ్యవహరించాని, 23 నెలల ఎరియర్స్ఇప్పించడంలో కోల్ మినిస్టర్ ద్వారా సర్క్యూలర్ జారీ చేయించారని తెలిపారు. సింగరేణి గుర్తింపు సంఘం టీబీజీకేఎస్.. బీఆర్ఎస్సర్కార్ చెప్పుచేతుల్లో సింగరేణి కంపెనీని పెట్టిందని ఆరోపించారు. కార్మికుల హక్కులను కాలరాస్తోందని, ఐదేండ్ల కాలంలో సీఎం కేసీఆర్ కార్మికులకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదన్నారు.
వచ్చే గుర్తింపు ఎన్నికల్లో బీఎంఎస్ యూనియన్ను కార్మికులకు ఆదరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్కే6 గనిలోని పలువురు బీఎంఎస్లో చేరారు. కార్యక్రమంలో యూనియన్ కేంద్ర కమిటీ సభ్యులు కాదాసు భీమయ్య, ఏరియా జాయింట్ సెక్రెటరీ పోడిశెట్టి వినోద్ కుమార్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ లు పూనం రామకృష్ణ, రాకేశ్, డివిజన్, కమిటీ సభ్యుడు బొడిగ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.