రాజన్న సిరిసిల్ల, వెలుగు : ఈ నెల 20న జిల్లా పర్యటనలో భాగంగా నిర్వహించే సీఎం రేవంత్ రెడ్డి సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి పిలుపు నిచ్చారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు చేస్తారని, దక్షిణ కాశీగా ఉన్న వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి, విస్తరణ చేపడుతున్నామన్నారు. సీఎం సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ఎస్పీ అఖిల్ మహాజన్, అడిషనల్ కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్, వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి తో కలిసి కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
నిర్వాసితులను కేసీఆర్ మోసం చేసిండు
వేములవాడ, వెలుగు : వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి గుడిమెట్లపై సీఎం హోదాలో కేసీఆర్ నిర్వాసితుల డబూల్ బెడ్ ఇళ్లకోసం రూ. 5 లక్షల 4 వేలు ఇస్తామని మాట ఇచ్చి మోసం చేశారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మానేరు నిర్వాసితులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో ఆయన సీఎం ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. నిర్వాసితులను ఆదుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రులకు ముంపు గ్రామాల ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.