కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తున్న వారికి భారీ శుభవార్త. భారత ప్రభుత్వ ఆరోగ్య అండ్ కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఢిల్లీలోని సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ(CMSS).. కాంట్రాక్ట్ ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మరి ఆ పోస్టులు ఎన్ని, వాటికి సంబంధించిన విద్యార్హతలు, జీతం వంటి మొదలైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఢిల్లీలోని సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ(CMSS) కాంట్రాక్ట్ ప్రాతిపదికన 15 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
విభాగాలు
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ప్రొక్యూర్ మెంట్)- 02
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్(క్వాలిటీ అస్యూరెన్స్)-01
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్(లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ విభాగం)-01
- అసిస్టెంట్ జనరల్ మేనేజర్(ఫైనాన్స్)-01
- మేనేజర్(ప్రొక్యూర్ మెంట్)-02
- మేనేజర్((లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్)-02
- మేనేజర్ (ఫైనాన్స్)-02
- మేనేజర్ (క్వాలిటీ అస్యూరెన్స్)-02
- వేర్ హౌస్ మేనేజర్(ఫార్మాసిస్ట్)-02
- ఆఫీస్ అసిస్టెంట్-01
విద్యార్హతలు: పోస్టును భట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, సీఏ, ఐసీడబ్య్లూఏ ఉత్తీర్ణతతో పాటుగా పని అనుభవం కూడా ఉండాలి.
అప్లై చేయడానికి చివరి తేదీ: 2024 మే 20 సాయంత్ర 5:30 గంటల వరకు.
వయోపరిమితి : అన్ని విభాగాల్లోని జనరల్ మేనేజర్, వేర్ హౌస్ మేనేజర్ పోస్టులకు 45 ఏళ్లు ఉండాలి. అలాగే.. అన్ని విభాగాల్లోని మేనేజర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి అభ్యర్థుల వయస్సు 40 ఏళ్లు మించకూడదు.
జీతం : నోటిఫికేషన్ ప్రకారం.. జనరల్ మేనేజర్ పోస్టులకు నెలకు జీతం రూ.1,00,000 ఉంటుంది. మేనేజర్ వేర్ హౌస్ మేనేజర్ పోస్టులకు నెల జీతం రూ.50,000 ఉండగా.. ఆఫీస్ అసిస్ట్ంట్ పోస్టుకు నెలవారి జీతం రూ.30వేలు ఉంటుంది.
దరఖాస్తు విధానం: సీఎంఎస్ఎస్ 2024 నోటిఫికేషన్ ప్రకారం.. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనునే అభ్యర్థులు కేవలం ఆఫ్ లైన్ విధానం ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పోస్ట్ ద్వారా దరఖాస్తును కింద తెలిపిన చిరునామాకు పంపగలరు.
అడ్రస్ : ది జనరల్ మేనేజర్(అడ్మినిస్టేషన్), సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ, సెకండ్ ఫ్లోర్, విశ్వ యువక్ కేంద్ర, టీన్ మూర్తీ మార్గ్, ఛాణక్యపురి, న్యూఢిల్లీ-11002