క్యాబ్, టాక్సీల కోసం బెస్ట్ మైలేజ్తో 5 రకాల CNG కార్లు..

క్యాబ్, టాక్సీల కోసం బెస్ట్ మైలేజ్తో 5 రకాల CNG కార్లు..

ప్రస్తుతం అన్ని చిన్న,పెద్ద నగరాల్లో టాక్సీ  లేదా క్యాబ్ లకు డిమాండ్ పెరుగుతోంది. దేశంలోని లక్షలాది మందికి క్యాబ్ డ్రైవింగ్ ప్రధాన ఆదాయ వనరు. క్యాబ్ లేదా ట్యాక్సీ కోసం ఎక్కువ సర్వీస్ , మెయింటెనెన్స్ తక్కువగా మంచి మైలేజీ ని ఇచ్చే కారు అవసరం. ఎక్కువ మైలేజీ, పొదుపు క్యాబ్ కోసం CNG కార్లను నడపడమే మంచిది. క్యాబ్ లేదా టాక్సీగా నడిపేందుకు లాభదాయకమైన 5 కార్ల గుర్తించి తెలుసుకుందాం.

మారతీ వ్యాగన్ఆర్ CNG: మారుతి వ్యాగన్ ఆఱ్ క్యాబ్ లు , ట్యాక్సీలకు ఉత్తమమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ 5 సీట్ల హ్యాచ్ బ్యాక్ క్యాబిన్ లో మంచి స్థలం ఉంటుంది. దీని వల్ల ప్రయాణికులకు ఇబ్బంది ఉండదు. దాని CNG  వేరియంట్ లో 1 లీటర్ ఇంజిన్ CNG ఎంపికతో అందుబాటులో ఉంది. మారుతి వ్యాగన్ ఆర్ క్యాబ్ వేరియంట్ టూర్ సీఎన్ జీ ధర రూ. 6.89 లక్షలు(ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభ మవుతుంది. 

మారుతి సెలెరియో CNG: మారుతి సెలెరియో సీఎన్ జి కూడా క్యాబ్ లకు మంచి ఎంపిక అని నిరూపించబడింది. సెలెరియో CNG ట్రిమ్ VXi వేరియంట్ తో ప్రారంభమవుతుంది. దీని ధర రూ. 6.74 లక్షలు(ఎక్స్ షోరూమ్ ) నుంచి ప్రారంభం. ఈ కారు CNG లో 35.6 km/kgమైలేజీని అందిస్తుంది. 

మారుతి డిజైర్ టూర్ S CNG: మారుతి సుజుకి డిజైర్ టూర్ S CNG  వెర్షన్ క్యాబ్ కోసం అందుబాటులో ఉంది. దీని ధర రూ. 7.46 లక్షలు(ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. డిజైర్ టూర్ S CNG 31.12km/kg మైలేజీని అందిస్తుంది. 

మారుతి ఎర్టిగా CNG: మారుతి ఎర్టిగా 7 సీటర్ పాపులర్ ఎమ్ పీవీ క్యాబ్ లు , టాక్సీలకోసం Special tour CNG మోడల్ లో అందుబాటులో ఉంది. దాని CNG 26.08 km /kg  మైలేజీని అందిస్తుంది. 

టిగోర్ CNG:  టాటా మోటార్స్ 5 సీట్ల కాంపాక్ట్ సెడాన్ టిగోర్ సీఎన్ జీ వేరియంట్ లో అందుబాటులో ఉంది. ప్లీట్ లేదా ట్యాక్సీ సేవ కోసం ఇది మంది కారుగా పేరుంది. దాని బేస్ CNG మోడల్ XM CNG ని రూ. 7.80 లక్షలకు కొనుగోలు చేయొచ్చు. ఇది 26.49 km/kg వరకు మైలేజీని అందిస్తుంది.