న్యూఢిల్లీ : దేశంలోని అనేక నగరాల్లో సీఎన్జీ ధర కిలోకు రూ. 2 పెరిగింది. త్వరలో ఎన్నికలు జరగనున్న ఢిల్లీలో మాత్రం ధరలు మారలేదు. దేశ రాజధాని, చుట్టుపక్కల నగరాల్లో సీఎన్జీ, సహజవాయువును గృహాలకు సరఫరా చేసే ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్, వారాంతంలో సీఎన్జీ ధరను కిలోకు 2 రూపాయలు పెంచింది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్, ఇతర నగరాల్లో ధరలు పెరిగాయి.
ముంబైలోని సిటీ గ్యాస్ రిటైలర్ మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (ఎంజీఎల్) ముంబై పరిసర ప్రాంతాల్లో సీఎన్జీ ధరలను కిలోకు రూ. 2 చొప్పున పెంచింది. ఎంజీఎల్, ఇతర సిటీ గ్యాస్ రిటైలర్లు అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ వంటివి, ఇన్‌పుట్ కాస్ట్‌లో 20 శాతం పెరిగినప్పటికీ గత రెండు నెలలుగా రిటైల్ ధరలను మార్చలేదు. సోమవారం ఇతర సిటీ గ్యాస్ రిటైలర్లు కూడా సీఎన్జీ ధరలను పెంచారు. హైదరాబాద్లో మాత్రం ధరలు మారలేదు.