హైదరాబాద్, వెలుగు: ఇంటీరియర్ డిజైన్ లో వాడే మెటీరియల్స్‌ను కస్టమర్లు చెక్ చేసుకునేలా అతిపెద్ద కోవర్కింగ్ స్పేస్‌ను హైదరాబాద్‌లో ప్రోలాన్స్ ఏర్పాటు చేసింది. ఈ సెంటర్‌ను 11,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయగా, ఇందులో 4,500 చదరపు అడుగులతో అతిపెద్ద డిస్ప్లే ఏరియాను కేటాయించారు. ఇంటీరియర్ డిజైనర్ల క్రియేటివిటీని పెంచేందుకు ఒకరితో ఒకరికి ప్రైవేట్ మీటింగ్స్, కోవర్కింగ్ కోసం రూమ్స్ ఉన్నాయని ప్రోలాన్స్ పేర్కొంది.
ఇంటీరియర్ డిజైనర్లు కూడా తమ క్లయింట్లకు ఎటువంటి మెటీరియల్‌ను సప్లయ్ చేస్తున్నామో ఈ కోవర్కింగ్ స్పేస్‌లో చూపించొచ్చని వివరించింది. హాఫెలె, హెట్టిక్, మెరినో, కెస్సెబోమర్, ఎబ్కో వంటి టాప్ కంపెనీలతో ప్రోలాన్స్ టై అప్ అయ్యింది. ఫర్నిషింగ్ కోసం మార్షల్స్, కిడ్స్ ఫర్నిచర్ కోసం స్మార్టస్టెర్స్, హోమ్ లైటింగ్ కోసం విప్రో వంటి కంపెనీలతో కూడా కలిసి పనిచేస్తోంది.