మైత్రివనంలో 20 కోచింగ్ సెంటర్లు సీజ్

మైత్రివనంలో 20 కోచింగ్ సెంటర్లు సీజ్

హైదరాబాద్‌లోని అమీర్‌పేట, మైత్రివనం ప్రాంతాల్లో ఉన్న పలు కోచింగ్ సెంటర్లను తనిఖీ చేశారు GHMC అధికారులు. ఫైర్‌ సేఫ్టీ నిబంధనలు పాటించని 20 కోచింగ్ సెంటర్లను గురువారం సీజ్ చేశారు. GHMC ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విశ్వజిత్ ఆధ్వర్యంలో పలు కోచింగ్ సెంటర్లపై దాడులు నిర్వహించారు. అయితే, గతంలోనే వీటికి ఫైర్‌ సేఫ్టీ లేదని తాఖీదులు జారీ చేసినప్పటికీ యాజమన్యాలు స్పందించలేదని..  ఫైర్ సేఫ్టీ నిబంధనల్ని గాలికొదిలేయడం వల్లే కోచింగ్ సెంటర్లను సీజ్‌ చేసినట్టు తెలిపారు GHMC అధికారులు.