సింగరేణిలో క్రీడలకు  పెద్దపీట : డైరెక్టర్​ సత్యనారాయణ 

సింగరేణిలో క్రీడలకు  పెద్దపీట : డైరెక్టర్​ సత్యనారాయణ 
  • కొత్తగూడెంలో కోల్​ఇండియా అథ్లెటిక్​స్థాయి పోటీలు షురూ
  • తొలి రోజు నాలుగు మెడల్స్​సాధించిన సింగరేణి 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణిలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నామని డైరెక్టర్​ఈఅండ్ఎం డి. సత్యనారాయణ పేర్కొన్నారు. పని ఒత్తిడితో ఉండే కార్మికులు, అధికారులకు క్రీడాపోటీలు కొత్త ఉత్సాహాన్నిస్తాయన్నారు.  కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో శనివారం కోల్ ​ఇండియా స్థాయి అథ్లెటిక్​ క్రీడాపోటీలను ఆయన ప్రారంభించి  క్రీడాజ్యోతిని వెలిగించారు.

క్రీడాకారుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కోలిండియా స్థాయి అథ్లెటిక్​ పోటీల బాధ్యత  సీఐఎల్​ సింగరేణికి ఇవ్వడం హర్షణీయమన్నారు. సింగరేణితో పాటు దేశంలోని తొమ్మిది బొగ్గు గని సంస్థల నుంచి క్రీడాకారులు పాల్గొంటున్నారని తెలిపారు. క్రీడాకారులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించామన్నారు.

సింగరేణి క్రీడాకారులు అత్యధిక పతకాలు సాధించి సంస్థకు పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ప్రోగ్రాంలో జీఎం పర్సనల్​కవితానాయుడు, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నేతలు మిర్యాల రంగయ్య, త్యాగరాజన్​, డీజీఎంలు అజయ కుమార్, రాజేంద్రప్రసాద్​, శివ కేశవులు, ఆఫీసర్లు వరప్రసాద్, రాజ్​గోపాల్, సుశీల్​ కుమార్​, స్పోర్ట్స్​ సూపర్​ వైజర్లు పోస్​నెట్, జాన్​ వెస్లీ, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.