- సింగరేణి మందమర్రి ఏరియా జీఎం దేవేందర్
- మందమర్రిలో కంపెనీ లెవల్
- ఫుట్బాల్ పోటీలు షురూ
కోల్బెల్ట్,వెలుగు: కోలిండియా లెవల్ఫుట్బాల్పోటీల్లో సింగరేణి క్రీడాకారులు సత్తా చాటి పతకాలు సాధించాలని సింగరేణి మందమర్రి ఏరియా జీఎం జి.దేవేందర్పేర్కొన్నారు. మంగళవారం మందమర్రి సింగరేణి హైస్కూల్ గ్రౌండ్లో కంపెనీ లెవల్ ఫుట్బాల్ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. క్రీడాకారులు క్రమశిక్షణ, అంకితభావంతో నైపుణ్యత ప్రదర్శిస్తారనే పేరుందని, అదే స్ఫూర్తితో క్రీడాల్లో రాణించాలని సూచించారు.
మందమర్రి ఏరియాలో సింగరేణి కంపెనీ స్థాయి పోటీల నిర్వహణకు సీఎండీ, డైరెక్టర్లు సహకరించడంఅభినందనీయమన్నారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. పోటీల ప్రారంభోత్సవంలో సింగరేణి ఆఫీసర్స్అసోసియేషన్ ప్రెసిడెంట్పైడిశ్వర్, ఏరియా పర్సనల్ మేనేజర్ శ్యాంసుందర్, స్పోర్ట్స్సెక్రటరీ, సీనియర్పీవో కార్తీక్, సింగరేణి స్పోర్ట్స్సూపర్వైజర్లు పాల్గొన్నారు.
పోటీల్లో తొలిరోజు గెలిచిన జట్లు
రెండు రోజులు జరిగే సింగరేణి కంపెనీ లెవల్ఫుట్బాల్ పోటీల్లో ఇల్లందు– -మణుగూరు జట్టుపై రామగుండం– 3 – -భూపాలపల్లి జట్టు, మందమర్రి- – బెల్లంపల్లి జట్టుపై శ్రీరాంపూర్ఏరియా జట్టు, రామగుండం – 3- – భూపాలపల్లి జట్టుపై రామగుండం1,2 జట్టు, కొత్తగూడెం- కార్పొరేట్ జట్టుపై శ్రీరాంపూర్ఏరియా జట్టు విజయాలు సాధించాయి.