
- సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్) సూర్యనారాయణ సూచన
- కొత్తగూడెంలో ముగిసిన కోల్ ఇండియా స్థాయి అథ్లెటిక్ క్రీడా పోటీలు
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : బొగ్గు కంపెనీల్లోని కార్మికులు, ఉద్యోగులు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో ప్రతిభ చూపాలని సింగరేణి కాలరీస్ కంపెనీ డైరెక్టర్ (ఆపరేషన్) ఎల్వీ సూర్యనారాయణ పేర్కొన్నారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో రెండు రోజులుగా జరుగుతున్న కోల్ ఇండియా స్థాయి అథ్లెటిక్ క్రీడా పోటీలు ఆదివారం ముగిశాయి.
జీఎం పర్సనల్ కవితా నాయుడు అధ్యక్షతన ఏర్పాటైన కార్యక్రమంలో విజేతలకు బహుమతులను అందించి మాట్లాడారు. సింగరేణి తో పాటు మొత్తం తొమ్మిది బొగ్గు కంపెనీల నుంచి 284 మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొనడం హర్షణీయమన్నారు.
ఒడిశా, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర పశ్చిమబెంగాల్ తో పాటు సింగరేణి కార్మికులు క్రీడా స్ఫూర్తితో ఆడారని పేర్కొన్నారు. మహిళా విభాగంలో బెస్ట్ అథ్లెట్ గా సింగరేణి చెందిన కె మన్విత సెలెక్ట్ కావడం అభినందనీయమన్నారు. సింగరేణి సంస్థ 18 మెడల్స్ సాధించడంతో హర్షం వ్యక్తం చేశారు.
ఈ ప్రోగ్రామ్ లో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అదనపు ప్రధాన కార్యదర్శి మిర్యాల రంగయ్య. ఐఎన్ టీసీ నేత పితాంబరం, డీజీఎంలు అజయ్ కుమార్, రాజేంద్రప్రసాద్ తో పాటు పలువురు అధికారులు, స్పోర్ట్స్ సూపర్ వైజర్లు పాల్గొన్నారు.
అథ్లెటిక్స్ పోటీల్లో సాధించిన మెడల్స్ ఇలా
బొగ్గు సంస్థ పాయింట్స్ గోల్డ్ సిల్వర్ బ్రాంజ్ మొత్తం
ఎంసీఎల్ 213 23 09 01 33
సీసీఎల్ 133 04 05 14 23
ఈసీఎల్ 11 05 09 04 18
ఎన్సీఎల్ 113 03 10 08 21
సింగరేణి 109 05 10 03 18
డబ్ల్యుసీఎల్ 91 02 03 10 15
ఎస్ఈసీఎల్ 7 04 02 08 14
బీసీసీఎల్ 62 03 01 02 06
సీఎంపీడీఐ 11 01 00 00 01