కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) దేశ వ్యాప్తంగా ఉన్న సీఐఎల్ కేంద్రాలు/ అనుబంధ సంస్థల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ విభాగాల్లో 640 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ (మైనింగ్/ సివిల్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్), బీటెక్ (కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్/ ఐటీ/ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్), ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు గేట్-2024 అర్హత సాధించి ఉండాలి. వయసు 30 సంవత్సరాలు మించరాదు.
సెలెక్షన్ ప్రాసెస్: గేట్-2024 స్కోర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 29 నుంచి నవంబర్ 28 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.coalindia.in వెబ్సైట్లో
సంప్రదించాలి.