రామప్పకు ఆరు కిలోమీటర్ల దూరంలో బొగ్గు గనులు

రామప్పకు 6 కిలోమీటర్ల దూరంలోనే బొగ్గు

ములుగు జిల్లా వెంకటాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలంలోని పాలంపేట గ్రామంలో రామప్ప ఆలయం ఉంది. ఇక్కడికి ఆరు కిలోమీటర్ల దూరంలో వెంకటాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రామ శివారులో 40.43 మిలియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు సింగరేణి సంస్థ గుర్తించింది. అన్ని రకాల సర్వేలు జరిపి 19 ఏండ్ల పాటు బొగ్గు తవ్వకాలు జరపాలని పర్మిషన్లు తీసుకుంది. 314 హెక్టార్ల అటవీ భూములు, 1,480 హెక్టార్ల వ్యవసాయ, ప్రభుత్వ అసైన్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూములను సేకరించాలని రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తయారు చేసింది. 

గతంలోనే కొంత భూమిని సేకరించి హద్దులు కూడా నిర్ణయించారు. రైతులకు పరిహారం అందించి, ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్యాకేజీ వర్తింపచేసి 2021 డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే తవ్వకాలు ప్రారంభించాలని మొదట భావించారు. అయితే రామప్ప దేవాలయానికి 2021 జూలై 25 యునెస్కో గుర్తింపు వచ్చింది. విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో సింగరేణి ఆఫీసర్లు సర్వే పనులు ఆపేసి రైతులతో మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు రద్దు చేసుకోవడమే కాకుండా నష్టపరిహారం డబ్బులు కూడా రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయలేదు.

ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుకూలంగా సర్వే రిపోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

వెంకటాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేయకుండా అభ్యంతరాలు రావడంతో సింగరేణి మూడేండ్లుగా వివిధ సంస్థలతో సర్వే చేయించింది. ఇక్కడ ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసి బాంబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్లాస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు జరిపినా రామప్ప టెంపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు చెరువుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఐఐటీ మద్రాస్, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ సర్వే బృందాలు చెప్పినట్లు సింగరేణి ఆఫీసర్లు చెబుతున్నారు. 

ప్రతి కిలోమీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఒక స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేసి టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు చేశామని, ఐదు కిలోమీటర్ల వరకు ఎటువంటి తీవ్రత లేదని, సైంటిఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైబ్రేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జీరోగా వచ్చాయని అంటున్నారు. ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐఐటీ సూరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఐఐటీ మద్రాస్ ఇప్పటివరకు నాలుగు రకాల సైంటిఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టడీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి బ్లాస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేదని తేల్చిందన్నారు. ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పొల్యూషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎన్విరాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంజినీరింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బృందం ఇటీవల రీసెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసిందన్నారు. 

రామప్ప టెంపుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 3.3 హెడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫ్రీక్వెన్సీని తట్టుకుంటుందని, సింగరేణి ఓపెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్లాస్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తీవ్రత ఓసీ నుంచి ఐదు కిలోమీటర్ల వరకు 0.01హెడ్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గానే ఉన్నట్లు రీసెర్చ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తేలిందన్నారు. ప్రస్తుతం భూపాలపల్లి ఏరియాలో నడుస్తున్న కేటీకే ఓసీ –3కి ఆరు కిలోమీటర్ల దూరంలోనే ఘనపురం చెరువు, ఐదు కిలోమీటర్ల దూరంలో కోటగుళ్లు ఉన్నాయని, మూడేండ్లుగా ఓసీ నడుస్తున్నా ఎలాంటి కంప్లైంట్స్ లేవని సింగరేణి ఆఫీసర్లు చెబుతున్నారు.