బొగ్గు ఉత్పత్తి టార్గెట్ 750 లక్షల టన్నులు : సీఎండీ శ్రీధర్

బొగ్గు ఉత్పత్తి టార్గెట్ 750 లక్షల టన్నులు : సీఎండీ శ్రీధర్
  • రివ్యూ మీటింగ్​లో సింగరేణి అధికారుల నిర్ణయం
  • రోజుకు 2.30 లక్షల టన్నుల ఉత్పత్తి, రవాణా చేయాలి: సీఎండీ శ్రీధర్

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : నెక్ట్స్‌‌‌‌‌‌‌‌ ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌లో 750లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి టార్గెట్‌‌‌‌‌‌‌‌ సాధించాలని సింగరేణి సీఎండీ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ సింగరేణి భవన్​లో ఆయన సంస్థ డైరెక్టర్లు, అడ్వైజర్లు, అన్ని ఏరియాల జీఎంలతో రివ్యూ మీటింగ్‌‌‌‌‌‌‌‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఒడిశాలోని నైనీ, కొత్తగూడెం ఏరియాలోని వీకే ఓపెన్ కాస్ట్​ నుంచి కనీసం 80లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుందన్నారు. ఫలితంగా 12% వృద్ధితో 750 లక్షల టన్నుల ఏడాది టార్గెట్‌‌‌‌‌‌‌‌ చేరుకోగలమని తెలిపారు. ఈ ఫైనాన్షియల్‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌లో చివరి మూడు నెలల్లో గరిష్ట స్థాయిలో బొగ్గు ఉత్పత్తి, రవాణా జరగడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇకపై రోజుకు 2.30 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా జరిగేలా అన్ని ఏరియాల జీఎంలు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. 17 లక్షల క్యూబిక్ మీటర్లకు పైగా ఓవర్ బర్డెన్ వెలికి తీసేందుకు కృషి చేయాలన్నారు.

ఉత్పత్తిలో కొత్తగూడెం టాప్​

కొత్త గూడెం ఏరియా ఉత్పత్తిలో టాప్ లో ఉండటంపై అభినందనలు తెలిపారు. అలాగే, మణుగూరు, ఇల్లందు మంచి వృద్ధిని కనబరుస్తున్నాయన్నారు. రామగుండం- 1, 2, 3 ఏరియాల్లోని అన్ని గనులు గతంకన్నా మెరుగుదలతో ముందుకుపోవడం సంతోషకరమని తెలిపారు. శ్రీరాంపూర్, మందమర్రి లక్ష్యాలకు చేరువగా కృషి చేస్తున్నాయన్నారు. భూపాలపల్లి, బెల్లంపల్లి ఏరియాలు మరింత పనిచేయాలని సూచించారు. కొత్త ప్రాజెక్టులు, గనుల విస్తరణకు భూసేకరణలో ప్రభుత్వం, కలెక్టర్లు సహకారం అందిస్తున్నారని వివరించారు. ప్రస్తుతం సగటున రోజుకు 2.21 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధిస్తున్నామని, ఇకపై అన్ని ఏరియాల్లో మరో 9వేల టన్నుల ఉత్పత్తిని సమకూర్చగలిగితే రోజు వారీతో పాటు ఏడాది లక్ష్యాన్ని చేరుకోగలమని తెలిపారు.